Revanth Reddy: ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి నామినేషన్.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy attended to Vijayasanthi nomination
  • నామినేషన్ దాఖలు చేసిన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్
  • నామినేషన్ కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి
  • సీపీఐ నుండి నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు
తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్‌కు నాలుగు, బీఆర్ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ దక్కనున్నాయి.

తమకు వచ్చే నాలుగు సీట్లలో పొత్తు ధర్మం ప్రకారం కాంగ్రెస్  ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. తమకు రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని సీపీఐ కోరగా, కొత్తగూడెం మాత్రమే కేటాయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు ఈ సీటును కేటాయించింది.
Revanth Reddy
Telangana
Congress

More Telugu News