Revanth Reddy: తెలంగాణకు నిధుల కోసం అవసరమైతే ధర్నా చేస్తాం: రేవంత్ రెడ్డి

- రాష్ట్రానికి నిధులు రాకూడదని బీఆర్ఎస్ చూస్తోందని విమర్శ
- రాష్ట్ర అభివృద్ధి, నిధులపై చర్చకు సిద్ధమన్న రేవంత్ రెడ్డి
- కిషన్ రెడ్డి చర్చకు సిద్ధం కావాలన్న ముఖ్యమంత్రి
తెలంగాణకు నిధుల విషయంలో అవసరమైతే, సందర్భం వస్తే ఢిల్లీలో ధర్నా చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి నిధులు రాకూడదని బీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు. సీఎల్పీలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, నిధులపై తాము చర్చకు సిద్ధమని చెప్పారు.
ఈ అంశాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. కిషన్ రెడ్డితో చర్చకు తాను, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు అధిక నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే కిషన్ రెడ్డికి, బీజేపీ నాయకులకు సన్మానం చేస్తామని అన్నారు.