Ravindra Jadeja: రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన రవీంద్ర జడేజా

Ravindra Jadeja Breaks Silence On Retirement Rumours
  • ఛాంపియన్స్ ట్రోఫీ సాధిస్తే జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు
  • ఫైనల్ మ్యాచ్‌లో జడేజా కోటా పూర్తి కాగానే కౌగిలించుకున్న కోహ్లీ
  • అవాస్తవ ప్రచారాలు చేయవద్దన్న జడేజా
రిటైర్మెంట్ గురించి నిరాధారమైన ప్రచారాలు వద్దని రవీంద్ర జడేజా స్పష్టం చేశారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జడేజా తన ఓవర్ల కోటాను పూర్తి చేయగానే కోహ్లీ పరుగెత్తుకుంటూ వచ్చి ఆలింగనం చేసుకోవడంతో, జడేజా వీడ్కోలు పలుకుతారనే ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.

ఈ ఊహాగానాలపై రవీంద్ర జడేజా స్వయంగా స్పందించారు. "నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయవద్దు.. ధన్యవాదాలు" అంటూ పోస్టు పెట్టారు. తద్వారా తాను వన్డేలలో మరికొంత కాలం పాటు కొసాగుతానని పరోక్షంగా వెల్లడించారు.

గత ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ట్వంటీ20లకు వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే ఈ ముగ్గురు ఆటగాళ్లు వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని రోహిత్ శర్మ ఇదివరకే ఖండించారు.
Ravindra Jadeja
Sports News
Cricket

More Telugu News