X Corp: ‘ఎక్స్’ పై సైబర్ దాడి.. ఉక్రెయిన్ పనేనంటూ ఎలాన్ మస్క్ ఆరోపణ

Elon Musk claims IP addresses in massive cyber attack on X originated from Ukraine area
  • ప్రపంచవ్యాప్తంగా సోమవారం ఎక్స్‌ సేవల్లో అంతరాయం
  • భారీ స్థాయిలో సైబర్ దాడి జరిగిందన్న మస్క్
  • సైబర్ దుండగుల ఐపీ అడ్రస్ లు ఉక్రెయిన్ ప్రాంతానికి చెందినవేనని వెల్లడి
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ (ట్విట్టర్) సేవల్లో సోమవారం అంతరాయం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ యూజర్లు ఇబ్బందిని ఎదుర్కొన్నారు. సోమవారం ఒక్కరోజే మూడుసార్లు సేవలు నిలిచిపోయాయి. అమెరికా, ఇండియా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రధాన దేశాల్లో ఎక్స్ సేవలకు అంతరాయం కలిగినట్లు 40,000 మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తాజాగా ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు. ఎక్స్ సేవల్లో అంతరాయానికి కారణం సైబర్ దాడేనని స్పష్టం చేశారు.

భారీ స్థాయిలో సైబర్ దాడి జరిగిందని, దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. సైబర్ దాడికి పాల్పడిన దుండగుల ఐపీ అడ్రస్ లు ఉక్రెయిన్ ప్రాంతానికి చెందినవేనని తెలిపారు. ఈ విషయంపై ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. 'ఎక్స్ పై సైబర్ దాడి జరిగింది. దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఉండొచ్చు. ప్రస్తుతానికి దీనిపై కచ్చితంగా చెప్పలేను కానీ ఐపీ అడ్రస్ లు మాత్రం ఉక్రెయిన్ ప్రాంతానికి చెందినవేనని గుర్తించాం' అని మస్క్ చెప్పారు. 

మూడుసార్లు డౌన్ అయిన ఎక్స్..
సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తొలుత ఎక్స్ డౌన్ అయిందని, ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు ఈ సమస్య ఎదురైందని ‘డౌన్ డిటెక్టర్’ వెల్లడించింది. తర్వాత రాత్రి 7.30 గంటలకు, ఆపై రాత్రి 9 గంటలకు మళ్లీ సేవల్లో అంతరాయం నెలకొందని పేర్కొంది. ఎక్స్ యాప్ వాడుతున్న యూజర్లలో 56 శాతం మంది, వెబ్‌సైట్‌ వాడుతున్న వారిలో 33 శాతం మంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారని తెలిపింది.
X Corp
Twitter
Elon Musk
cyber attack
Ukraine
IP Address

More Telugu News