Adoni: కర్నూలు జిల్లా ఆదోనిలో విషాదం... అదుపుతప్పిన బస్సు... నలుగురి మృతి

Karnataka RTC Bus Hit Two Bikes in Adoni Four Dead
కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రెండు బైక్ లను ఢీ కొట్టింది. దీంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని ఆదోని మండలం పాండవగల్లులో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన  ఆర్టీసి బస్సు ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. 

ఈ ప్రమాదంలో గాయపడిన మరొక వ్యక్తిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Adoni
RTC Bus
Road Accident
Bike
Andhra Pradesh

More Telugu News