Raj Nath Singh: నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదిలోనూ సీట్లు పెరుగుతాయి: రాజ్‌నాథ్ సింగ్

Delimitation Will Increase Seats Even In Tamil Nadu Says Rajnath Singh
  • తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు పెరుగుతాయన్న రాజ్‌నాథ్ సింగ్
  • పునర్విభజన ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా ఉంటుందన్న రాజ్‌నాథ్ సింగ్
  • అభ్యంతరాలు ఉంటే ఆ అంశాలను స్టాలిన్ లేవనెత్తవచ్చన్న కేంద్ర మంత్రి
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదనలో నిజం లేదని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. తమిళనాడు సహా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో కూడా సీట్ల సంఖ్య పెరుగుతుందని ఆయన అన్నారు.

పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తమిళనాడు, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంటులో తమిళనాడుకు ప్రాతినిథ్యం తగ్గుతుందని స్టాలిన్ అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ స్పందించారు.

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రణాళికా బద్ధంగా కొనసాగుతుందని భావిస్తున్నానని కేంద్ర మంత్రి అన్నారు. అభ్యంతరాలు ఉంటే స్టాలిన్‌కు ఆ అంశాలను లేవనెత్తే స్వేచ్ఛ ఉందని ఆయన అన్నారు. సంబంధిత అధికారులు చర్చ జరుపుతారని, నిర్ణయం న్యాయంగా ఉంటుందని అన్నారు. శాసన సభ లేదా లోక్ సభ ఏదైనా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సీట్ల సంఖ్య పెరగడం సహజమే అన్నారు.
Raj Nath Singh
BJP
MK Stalin
Tamil Nadu

More Telugu News