Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారీ షాక్ ఇచ్చిన ఢాకా కోర్టు

Dhaka Court orders to seize assets and bank accounts of Sheikh Hasina
  • భారత్ లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా
  • ఆమెను స్వదేశానికి రప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం
  • ఆమెతో పాటు ఆమె బంధువుల ఆస్తులు, బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయాలని కోర్టు ఆదేశం
భారత్ లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకా కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను సీజ్ చేయాలని ఢాకా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో 124 బ్యాంక్ అకౌంట్లను అధికారులు సీజ్ చేయనున్నారు. 

గత ఏడాది ఆగస్ట్ లో బంగ్లాదేశ్ లో అల్లర్లు చెలరేగాయి. భారీ ఎత్తున హింస చోటుచేసుకుంది. దీంతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ కు వచ్చి తలదాచుకుంటున్నారు. హసీనాను బంగ్లాదేశ్ కు రప్పించేందుకు ఆ దేశం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆమె పాస్ పోర్టును కూడా రద్దు చేసింది. ఆమెను బంగ్లాదేశ్ కు పంపించాలని భారత ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది. అయినా భారత్ సానుకూలంగా స్పందించలేదు. తాజాగా, ఢాకా కోర్టు హసీనా, ఆమె బంధువుల ఆస్తులు, బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయాలని ఆదేశించింది.
Sheikh Hasina
Bangladesh

More Telugu News