JD Vance: కుటుంబ సమేతంగా భారత్ లో పర్యటించనున్న అమెరికా ఉపాధ్యక్షుడు

JD Vance and his wife Usha to visit India
  • భారత్ లో పర్యటించనున్న జేడీ వాన్స్ దంపతులు
  • జేడీ వాన్స్ భార్య ఉష పూర్వీకులది ఆంధ్రప్రదేశ్
  • అమెరికాకు వెళ్లి స్థిరపడ్డ ఉష తల్లిదండ్రులు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉష త్వరలోనే భారత్ లో పర్యటించనున్నారు. ఈ నెలలోనే జేడీ వాన్స్ దంపతులు భారత్ లో పర్యటించనున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత నెలలో ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో జేడీ వాన్స్ పర్యటించారు. ఆయన రెండో విదేశీ పర్యటన భారత్ లో ఉండనుంది. 

జేడీ వాన్స్ భారత్ కు అల్లుడు అనే విషయం తెలిసిందే. ఆయన భార్య పూర్వీకులది ఆంధ్రప్రదేశ్. ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అమెరికాలో విద్యను అభ్యసించేటప్పుడు జేడీ వాన్స్ ను ప్రేమించారు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 

ఇటీవల ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా జేడీ వాన్స్ కుటుంబంతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా వాన్స్ పిల్లలకు మోదీ ప్రత్యేకమైన బహుమతులు కూడా అందించారు. వాన్స్ కుమారుడు వివేక్ పుట్టినరోజు వేడుకల్లో కూడా మోదీ పాల్గొన్నారు.
JD Vance
USA
India

More Telugu News