Sreeleela: శ్రీలీలతో కొడుకు అనుబంధంపై కార్తీక్ ఆర్యన్ తల్లి ఏమన్నారంటే..!

Kartik Aaryans mom adds fuel to sons dating rumours with Sreeleela
  • కార్తీక్, శ్రీలీల డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం
  • కొంతకాలంగా జంటగా కనిపిస్తుండడంతో ఊహాగానాలు
  • ఐఫా వేడుకల ప్రధానోత్సవంలో కార్తీక్ తల్లితో కరణ్ జోహార్ ఇంటర్వ్యూ
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ కుటుంబంలో ఇటీవల జరిగిన ఓ పార్టీకి నటి శ్రీలీల హాజరుకావడంతో వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. పలు ఫంక్షన్లకు కార్తీక్ ఆర్యన్, శ్రీలీల కలిసి హాజరకావడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. అయితే, ఇటీవల జరిగిన ఐఫా వేడుకల్లో కార్తీక్ ఆర్యన్ తల్లి మాలా తివారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఆమెను సరదాగా ఇంటర్వ్యూ చేశారు. కార్తీక్, శ్రీలీల అనుంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ‘ఎలాంటి కోడలు రావాలని మీరు కోరుకుంటున్నారు’ అని ప్రశ్నించారు. దీనికి మాలా తివారీ స్పందిస్తూ.. ఓ మంచి డాక్టర్ మా ఇంటికి కోడలుగా రావాలని తమ కుటుంబం భావిస్తోందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు శ్రీలీలను ఉద్దేశించే చేశారని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఓవైపు సినిమాల్లో నటిస్తూనే శ్రీలీల ఎంబీబీఎస్ చదువుతోంది. వైద్య విద్యతో పాటే ఇండస్ట్రీలో కొనసాగుతుండడం సంతోషంగా ఉందని పలు సందర్భాలలో శ్రీలీల చెప్పుకొచ్చారు. తాజాగా కార్తీక్ ఆర్యన్ తల్లి చేసిన వ్యాఖ్యలు వారిద్దరి బంధానికి తమ ఆశీస్సులు ఉన్నాయని చెప్పకనే చెప్పినట్లైంది. కాగా, దక్షిణాదిలో హీరోయిన్‌గా గుర్తింపుతెచ్చుకున్న శ్రీలీల.. అనురాగ్‌ బసు దర్శకత్వంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు. షూటింగ్ సమయంలో కార్తిక్‌, శ్రీలీల మధ్య పరిచయం పెరిగిందని, ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
Sreeleela
Kartik Aaryan
IFFA
Karan Johar

More Telugu News