Yogi Adityanath: నేపాల్‌లో రాచరికానికి మద్దతుగా ర్యాలీ... యోగి ఆదిత్యనాథ్ చిత్రాల ప్రదర్శన

Yogi Adityanath Photo At Pro Monarchist Rally Sparks Controversy In Nepal
  • రాచరికాన్ని పునరుద్ధరించాలంటూ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ర్యాలీ
  • జ్ఞానేంద్ర షాతో పాటు యోగి ఆదిత్యనాథ్ చిత్రపటాల ప్రదర్శన
  • ప్రధాని కేపీ ఓలి వర్గం ప్రజాతంత్ర పార్టీ ప్రతినిధి వివరణ
నేపాల్‌లో రాచరికానికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రాలను ప్రదర్శించారు. ఇందుకు కారణం, యోగి నేపాల్‌లో రాచరికానికి బలమైన మద్దతుదారు. 

నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర షాతో యోగికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల భారత్‌లో పర్యటించిన జ్ఞానేంద్ర షా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.

నేపాల్‌లో రాచరికానికి మద్దతిచ్చే రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. నేపాల్‌లో రాచరిక పాలనను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో జ్ఞానేంద్ర షాతో పాటు యోగి ఆదిత్యనాథ్ చిత్రాలను ప్రదర్శించారు.

ఇతర దేశాల నేతల చిత్రపటాలను ప్రదర్శించడంపై విమర్శలు రావడంతో రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ప్రతినిధి వివరణ ఇచ్చారు. తమ ఉద్యమానికి చెడ్డపేరు తీసుకురావడానికి ప్రధాని కేపీ ఓలి వర్గం ఈ ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ ఫొటోలను ప్రదర్శించిందని ఆరోపించారు. ప్రధాని ఓలి ముఖ్య సలహాదారు సూచనల మేరకు ర్యాలీలో యోగి చిత్రాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను ప్రధాని ఓలి ముఖ్య సలహాదారు బిష్ణు రిమాల్ ఖండించారు.
Yogi Adityanath
Nepal
India

More Telugu News