Blood Rain: ఇరాన్ బీచ్ లో ‘బ్లడ్ రెయిన్’.. వీడియో ఇదిగో!

Iran Beach Turns Bright Red After Mysterious Blood Rain
  • రక్త ప్రవాహంలా సముద్రంలోకి చేరుతున్న వర్షపు నీరు
  • ఎరుపు వర్ణంలోకి మారిన తీరప్రాంతం
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఇరాన్ లోని రెయిన్ బో ఐలాండ్ లో రక్తంలా ఎర్రని రంగులో వర్షం కురిసింది. ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై చేరగానే ఎరుపు వర్ణంలోకి మారిపోతోంది. అది రక్తపు నీరులా ప్రవహించి సముద్రంలోకి చేరుతోంది. దీంతో బీచ్ మొత్తం ఎరుపు రంగులోకి మారి భయపెడుతోంది. ఏటా ఈ దృశ్యం చూసేందుకు లక్షలాదిగా పర్యాటకులు ఇరాన్ లో వాలిపోతుంటారు. తాజాగా కొంతమంది టూరిస్టులు రెయిన్ బో ఐలాండ్ లో వర్షాన్ని ఎంజాయ్ చేశారు. ఎరుపు రంగులో రక్తాన్ని తలపించేలా పారుతున్న వరద నీటిలో గంతులు వేశారు. సముద్ర తీరంలోని గుట్టలపై పడిన వర్షం జలపాతంలా కిందకు దూకుతుంటే కేరింతలు కొట్టారు. ఈ ఎర్రని ప్రవాహాన్ని ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. పకృతిలోని వింతలకు ఇదొక ఉదాహరణ అని, ఉన్నఫళంగా అక్కడికి చేరాలని ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

రెయిన్ బో ఐలాండ్ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం ఓ అగ్ని పర్వతం ఉండేదని, దాని నుంచి వెలువడిన లావా చల్లారి ఈ దీవి ఏర్పడిందని ఇరాన్ చరిత్రకారులు చెబుతున్నారు. అక్కడి మట్టిలో ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ చాలా అధిక మోతాదులో ఉంటుందని, వర్షపు నీరు రక్త వర్ణంలోకి మారడానికి కారణం ఇదేనని వివరణ ఇచ్చారు. ఈ అరుదైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు రెయిన్ బో ఐలాండ్ కు వస్తుంటారని చెప్పారు.
Blood Rain
Iran Beach
Rainbow Island
Viral Videos

More Telugu News