Robbery: భ‌లేదొంగ‌లు.. ఎత్తుకెళ్లిందెంటో తెలిస్తే షాక‌వ్వాల్సిందే.. వైర‌ల్ వీడియో!

Thieves Steal Police Shoes And Sandals in Hyderabad Video Goes Viral
  
హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలో గ‌త కొన్నిరోజులుగా దొంగ‌లు రెచ్చిపోతున్నారు. చేతికి అందిన‌కాడికి దోచుకెళ్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల త‌ర‌చూ దోపిడీ కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే, తాజాగా న‌గ‌రంలోని మూసారాంబాగ్ ప‌రిధిలోని ఈస్ట్ ప్ర‌శాంత్ న‌గ‌ర్‌లో దొంగ‌లు వింత చోరీకి పాల్ప‌డ్డారు. అపార్ట్‌మెంట్స్‌లో చొర‌బ‌డి చెప్పులు, బూట్లు ఎత్తుకెళ్లారు. 

ఏక కాలంలో ఇలా నాలుగు అపార్ట్‌మెంట్ల‌లో దోపిడీకి పాల్ప‌డ్డారు. ఉద‌యం బ‌య‌ట‌కు వ‌చ్చి చూసిన అపార్ట్‌మెంట్ వాసుల‌కు త‌మ చెప్పులు, బూట్లు క‌నిపించ‌క‌పోవ‌డంతో కంగుతిన్నారు. వెంట‌నే సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించ‌గా దొంగ‌లు ఎత్తుకెళ్లిన‌ట్లు గుర్తించి షాక‌య్యారు. కొస మెరుపు ఏంటంటే బాధితుల్లో మ‌హిళా స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్, ఓ పోలీస్‌ ఇన్‌స్పెక్ట‌ర్ ఉండ‌టం. ఈ దొంగ‌త‌నానికి సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైనశైలిలో స్పందిస్తున్నారు.  

Robbery
Thieves
Sandals
Hyderabad
Team India
Viral Videos

More Telugu News