Harish Rao: అసెంబ్లీ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెడతాం: హరీశ్ రావు

We will move no confidence motion on Assembly Speaker
  • స్పీకర్ ను జగదీశ్ రెడ్డి అవమానించలేదన్న హరీశ్ రావు
  • రికార్డులు తీయాలని స్పీకర్ ను అడిగినా తెప్పించలేదని విమర్శ
  • అసెంబ్లీ మీడియా పాయింట్ ను కూడా బ్లాక్ చేశారని మండిపాటు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ ను అవమానించలేదని మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సభ ప్రతి ఒక్కరిదని... 'మీ' అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదని చెప్పారు. 'మీ ఒక్కరిది' అనే పదం కూడా అన్ పార్లమెంటరీ కాదని అన్నారు. కాంగ్రెస్ సభ్యులు ఎందుకు నిరసన వ్యక్తం చేశారో... సభను స్పీకర్ ఎందుకు వాయిదా వేశారో అర్థం కావడం లేదని చెప్పారు. 

దళిత స్పీకర్ ను అవమానించేలా జగదీశ్ రెడ్డి మాట్లాడలేదని హరీశ్ అన్నారు. స్పీకర్ ను కలిశామని... రికార్డులు తీయాలని అడిగామని చెప్పారు. 15 నిమిషాలు అయినా వీడియో రికార్డును స్పీకర్ తెప్పించలేదని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడకుండా బ్లాక్ చేశారని... స్పీకర్ ప్రజాస్వమ్యబద్ధంగా పని చేయాలని, లేకపోతే ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారు.
Harish Rao
G Jagadish Reddy
BRS
Gaddam Prasad Kumar
Congress

More Telugu News