Dastagiri: వైఎస్ వివేకా హత్య కేసు సాక్షుల వరుస మరణాలు... దస్తగిరికి భద్రత పెంపు

YS Viveka murder case approver Dastagiri security increased
  • హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై దస్తగిరి ఆందోళన
  • తనకు భద్రతను పెంచాలని జిల్లా ఎస్పీకి విన్నపం
  • 1 ప్లస్ 1 నుంచి 2 ప్లస్ 2కి భద్రత పెంపు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు వరుసగా అనుమానాస్పదంగా మృతి చెందుతుండటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో, ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి పోలీసులు భద్రతను పెంచారు. ప్రస్తుతం దస్తగిరికి 1 ప్లస్ 1 సెక్యూరిటీ ఉండగా... దీన్ని 2 ప్లస్ 2కి పెంచారు. ఈ మేరకు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.  

వివేకా హత్య కేసులో సాక్షులు వరుసగా మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి దస్తగిరి వెళ్లారు. తనకు భద్రత పెంచాలంటూ జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించారు. తాను కడప జైల్లో ఉన్నప్పుడు డాక్టర్ చైతన్య రెడ్డి తనను బెదిరించారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దస్తగిరికి పోలీసులు భద్రతను పెంచారు. 
Dastagiri
YS Viveka Murder Case
Security

More Telugu News