Chandrababu: పారిశుద్ధ్య కార్మికుల‌తో సీఎం చంద్ర‌బాబు ముఖాముఖి

CM Chandrababu Visits Tanuku
  • ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా త‌ణుకులో ప‌ర్య‌టిస్తున్న ముఖ్య‌మంత్రి
  • ఎన్‌టీఆర్ పార్క్ వ‌ద్ద పారిశుద్ధ్య కార్మికుల‌తో ముఖాముఖి
  • త‌ణుకు కూర‌గాయ‌ల హోల్‌సెల్ మార్కెట్‌ను ప‌రిశీలించిన సీఎం
సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా త‌ణుకులో ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక ఎన్‌టీఆర్ పార్క్ వ‌ద్ద పారిశుద్ధ్య కార్మికుల‌తో ముఖ్య‌మంత్రి ముఖాముఖిలో పాల్గొన్నారు. త‌ణుకు కూర‌గాయ‌ల హోల్‌సెల్ మార్కెట్‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా కూర‌గాయ‌ల వ్య‌ర్థాల నుంచి ఎరువుల త‌యారీపై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. 

అంత‌కుముందు స్థానిక పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం చంద్ర‌బాబుకు మంత్రులు, పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వీరిలో మంత్రులు నిమ్మ‌ల రామానాయుడు, గొట్టిపాటి ర‌వి కుమార్‌, నారాయ‌ణ‌, ఏపీ స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ట్టాభిరామ్ త‌దిత‌రులు ఉన్నారు.
Chandrababu
Tanuku
West Godavari District
Andhra Pradesh

More Telugu News