Chandrababu: పదో తరగతి పరీక్షలు రాస్తున్న నా యువ నేస్తాలకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

CM Chandrababu wishes all the best for 10th Class students
  • ఏపీలో రేపటి నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్
  • సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపిన సీఎం చంద్రబాబు
  • మీపై మీరు నమ్మకం ఉంచితే విజయం తథ్యం అంటూ ఆశీస్సులు
ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులకు విషెస్ తెలిపారు. "పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న నా యువ నేస్తాలందరికీ శుభాకాంక్షలు. విద్యా ప్రస్థానంలో పరీక్షలనేవి కీలక మైలురాళ్లు. పరీక్షలపైనే దృష్టి పెట్టండి... గట్టిగా కృషి చేయండి... సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీపై మీరు నమ్మకం ఉంచాలన్న విషయం మర్చిపోవద్దు... విజయం దానంతట అదే వస్తుంది" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. 

ఏపీలో పదో తరగతి పరీక్షలు రేపు (మార్చి 17) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
Chandrababu
10th Class Exams
Students
Andhra Pradesh

More Telugu News