Kannappa: మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'కన్నప్ప' మూడో పాట విడుదల

Third single from Kannappa movie will release on Mohan Babu birthday
  • మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న 'కన్నప్ప'
  • ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్
  • ఇప్పటికే రెండు పాటలు విడుదల
  • మార్చి 19న మూడో సింగిల్ రిలీజ్
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నుంచి థర్డ్ సింగిల్ అప్డేట్ వచ్చింది. 'మహాదేవ శాస్త్రి పరిచయ గీతం'ను మార్చి 19న మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆవిష్కరించనున్నారు. మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడమే కాకుండా మహాదేవ శాస్త్రి పాత్రను కూడా పోషించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేయనున్నారు. 

మోహన్ బాబుతో పాటుగా ఈ చిత్రంలో మంచు విష్ణు, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ స్వరపరిచిన పాటలు ఇప్పటికే శ్రోతలను అలరించాయి. ఇక ఇప్పుడు మూడో పాటగా మహదేవ శాస్త్రి పరిచయ గీతాన్ని విడుదల చేయనున్నారు. 

అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించారు. ఏప్రిల్ 25న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Kannappa
Mohan Babu
Manchu Vishnu
Mukesh Kumar Singh

More Telugu News