KTR: మా జానారెడ్డితో ఫొటో దిగడానికి భయంలేదు: జానారెడ్డి-కేటీఆర్ ఆసక్తికర సంభాషణ

Interesting conversation between Jana Reddy and KTR
  • జానారెడ్డి ఆరోగ్యం గురించి అడిగిన కేటీఆర్
  • బాగానే ఉన్నానంటూ, నా వయస్సు ఎంతో తెలుసా? అని జానారెడ్డి ప్రశ్న
  • తన వయస్సు 79 దాటిందన్న జానారెడ్డి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సరదా సంభాషణ జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు హాజరుకాలేదు. సమావేశం అనంతరం జానారెడ్డి పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఆయన పత్రికా సమావేశం ముగిసే సమయానికి అక్కడకు కేటీఆర్ వచ్చారు.

ఈ సమయంలో ఇరువురు సరదాగా మాట్లాడుకున్నారు. కేటీఆర్ మొదట జానారెడ్డి ఆరోగ్యం గురించి వాకబు చేశారు.

మీ ఆరోగ్యం ఎలా ఉందని కేటీఆర్ అడగగా, బాగుందని జానారెడ్డి చెప్పారు.

నా వయస్సు ఎంత ఉంటుందో తెలుసా? అని జానారెడ్డి అడిగారు. దానికి కేటీఆర్ స్పందిస్తూ, డెబ్బై ఏళ్లకు పైగా ఉండొచ్చని అనుకుంటున్నానని పేర్కొన్నారు. నా వయస్సు 79 దాటిందని జానారెడ్డి తెలిపారు. 

ఆ తర్వాత కేటీఆర్ నవ్వుతూ, మా జానారెడ్డితో ఫొటో దిగడానికి ఎలాంటి భయం లేదని ఆయనతో కలిసి ఫొటో దిగారు.
KTR
Jana Reddy
Telangana
Congress
BRS

More Telugu News