Vishnupriya: విష్ణుప్రియ సహా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలకు నోటీసులు

Vishnupriya and Others Receive Notices for Promoting Betting Apps
  • బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసుల నజర్
  • ఇప్పటికే పలువురు యూట్యూబర్లపై కేసులు
  • తాజాగా  విష్ణుప్రియ, టేస్టీ తేజ సహా పలువురు సెలబ్రిటీలకు నోటీసులు
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ప్రముఖులకు హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం విచారణకు హాజరు కావాల్సిందిగా విష్ణుప్రియ, టేస్టీ తేజలకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ వ్యవహారంలో మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా పదకొండు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన మరికొందరిపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Vishnupriya
Betting Apps
Celebrity Endorsements
Panjagutta Police
Hyderabad Police
Tasty Teja
Illegal Betting
Notices Issued
YCP Spokesperson Shyama

More Telugu News