Smitha Sabarwal: స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైన వ్యవసాయ వర్సిటీ

Agriculture University to Issue Notice to IAS Officer Smitha Sabarwal
  • విశ్వవిద్యాలయం నుంచి వాహన అద్దెకు నిధులు తీసుకోవడంపై ఆడిట్ శాఖ అభ్యంతరం
  • వాహన అద్దె కింద తీసుకున్న నిధులు తిరిగి చెల్లించాలని నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం
  • సీఎంవో అదనపు కార్యదర్శి హోదాలో రూ.61 లక్షలు తీసుకున్న స్మితా సబర్వాల్
తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నోటీసులు జారీ చేయడానికి సిద్ధమైంది. విశ్వవిద్యాలయం నుంచి వాహన అద్దెకు తీసుకున్న నిధులపై ఆడిట్ శాఖ అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆమెకు నోటీసులు ఇవ్వాలని విశ్వవిద్యాలయ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.

వాహన అద్దె కింద తీసుకున్న నిధులను తిరిగి చెల్లించాలని రెండ్రోజుల్లో ఆమెకు అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 2016 నుంచి 2024 మార్చి మధ్య కాలంలో సీఎంవో అదనపు కార్యదర్శి హోదాలో ఆమె 90 నెలలకు గాను వాహన అద్దె కింద రూ. 61 లక్షలు తీసుకున్నారు. న్యాయ నిపుణుల సూచనల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Smitha Sabarwal
Jayashankar Telangana State Agricultural University
IAS Officer
Vehicle Rent
Audit Objection
Notice
Telangana
Funds
Legal Notice

More Telugu News