Wife Harassment: రోజుకు 5 వేలు ఇస్తేనే కాపురం చేస్తా.. టెకీకి భార్య వేధింపులు

Software Engineer Accuses Wife of Harassment And Demands Rs 5000 Daily
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి
  •  ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని వెల్లడి
  • విడాకులు కోరితే రూ.45 లక్షలు డిమాండ్ చేస్తోందని ఆవేదన
భార్య వేధింపులు భరించలేకపోతున్నానంటూ బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీకాంత్ పోలీసులను ఆశ్రయించారు. నిత్యం దూషించడం, డబ్బుల కోసం డిమాండ్ చేయడంతో పాటు అడిగినంత ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, తనతో కాపురం చేయాలంటే రోజుకు రూ.5 వేలు ఇవ్వాలని అడుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

వర్క్ ఫ్రం హోం చేసుకోనివ్వడం లేదని, జూమ్ కాల్ మాట్లాడుతుంటే మధ్యమధ్యలో వచ్చి డ్యాన్స్ చేస్తోందని చెప్పారు. ఇవన్నీ భరించలేక విడాకులు కోరితే రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందన్నారు. తమకు 2022 లోనే వివాహం జరిగిందని తెలిపారు. కాగా, శ్రీకాంత్ భార్య మాత్రం ఇవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు. మరో పెళ్లి చేసుకోవడం కోసం తనపై నిందలు వేస్తున్నాడని, ఆడియోలు వీడియోలను ఎడిట్ చేసి వాటితో పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడని ఆరోపించారు.
Wife Harassment
Domestic Violence
Bangalore
Software Engineer
Divorce
Financial Demands
Work From Home Issues
India

More Telugu News