Nitish Kumar: వివాదంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్‌.. రాజీనామా చేయాల‌ని తేజ‌స్వీ యాద‌వ్ డిమాండ్‌!

Nitish Kumar in Controversy Tejashwi Yadav Demands Resignation
   
బీహార్ సీఎం నితీశ్ కుమార్ తాజాగా మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆయ‌న అక్క‌డ వ్య‌వ‌హ‌రించిన తీరు వివాదానికి దారి తీసింది. ప‌ట్నాలో ఓ క్రీడా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న జాతీయ గీతం ప్లే అవుతుండ‌గా న‌వ్వుతూ ప‌క్క‌న ఉన్న వారిని ప‌ల‌క‌రించారు. 

ఈ వీడియోను విప‌క్ష నేత తేజ‌స్వీ యాద‌వ్ పోస్ట్ చేస్తూ సీఎం హోదాలో ఉండి ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం ఏంట‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. మాన‌సికంగా, శారీర‌కంగా ఆయ‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి అర్హుడు కాద‌న్నారు. వెంట‌నే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. 
Nitish Kumar
Bihar CM
Tejashwi Yadav
National Anthem Controversy
Patna
Political Controversy
India Politics
Resignation Demand
Sports Event

More Telugu News