Sourabh Rajput: మర్చంట్ నేవీ అధికారి హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Merchant Navy Officers Brutal Murder Shocking Details Emerge
  • మొండాన్ని బెడ్ బాక్స్‌లో పెట్టి దానిపైనే రాతంత్రా నిద్రించిన భార్య
  • తల, చేతులను ఇంటికి తీసుకెళ్లిన ఆమె ప్రియుడు సాహిల్
  • ప్లాన్ మార్చి ప్లాస్టిక్ డ్రమ్ము, సిమెంట్ కొని అందులో మృతదేహాన్ని వేసి కాంక్రీట్‌తో సీల్ చేసిన వైనం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మర్చంట్ నేవీ అధికారి హత్యకేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. కుమార్తె పుట్టినరోజు కోసం విదేశాల నుంచి వచ్చిన భర్త సౌరభ్ రాజ్‌పుత్ (29)ను ప్రియుడు సాహిల్‌ (25)తో కలిసి భార్ ముస్కాన్ (27) రస్తోగి దారుణంగా హత్య చేసింది. ఆపై మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లిన సాహిల్ దానిని ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత కవర్లలో పెట్టి నిర్మానుష్య ప్రాంతంలో శరీర భాగాలను విసిరేయాలని అనుకున్నారు. 

దీంతో శరీరం నుంచి తల, చేతులను వేరు చేసిన సాహిల్ వాటిని కవర్‌లో పెట్టి ఇంటికి తీసుకెళ్లాడు. మొండాన్ని బెడ్ బాక్స్‌లో పెట్టిన ముస్కాన్ రాత్రంతా దానిపైనే నిద్రించింది. ఇంటికి తీసుకెళ్లిన తల, చేతులను సాహిల్ కొన్ని గంటలపాటు తన వద్దే ఉంచుకున్నాడు. అయితే, ఆ తర్వాత మరో ప్లాన్ వేశారు. స్థానిక మార్కెట్‌లో ప్లాస్టిక్ డ్రమ్, సిమెంట్ కొనుక్కొచ్చారు. అందులో సౌరభ్ మృతదేహాన్ని ఉంచి కాంక్రీట్, చెత్తా చెదారంతో దానిని నింపేశారు.


నిందితులిద్దరూ స్కూల్‌లో చదువుకున్నప్పటి నుంచీ స్నేహితులని, 2019లో వాట్సాప్ గ్రూప్ ద్వారా మళ్లీ పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి రావడంతో అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ముస్కాన్ నిర్ణయించింది. ఈ క్రమంలో కుమార్తె పుట్టినరోజు కోసం లండన్ నుంచి భర్త రావడంతో ఇదే సరైన సమయం అని నిందితులు భావించారు.

లండన్ నుంచి వచ్చిన సౌరభ్.. వేరే ప్రాంతంలో ఉన్న తన తల్లిదండ్రులను చూసేందుకు వెళ్లాడు. వస్తూవస్తూ తల్లి ఇచ్చిన వంటకాన్ని తెచ్చుకున్నాడు. దానిని వేడి చేసే నెపంతో ముస్కాన్ అందులో మత్తు పదార్థాలు కలిపింది. సౌరభ్ స్పృహ కోల్పోయాక.. ముస్కాన్, సాహిల్ ఇద్దరూ కలిసి నిద్రపోతున్న సౌరభ్‌పై దాడిచేసి కిరాతకంగా హత్య చేశారు. 
Sourabh Rajput
Muskan Rastogi
Sahil
Merchant Navy Officer Murder
India Crime News
Extramarital Affair
Brutal Murder
London
Whatsapp Group
Murder Case

More Telugu News