Rohit Sharma: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్... రోహిత్ శర్మ డకౌట్

Chennai Super Kings Wins Toss Rohit Sharma Ducks Out
  • ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్
  • రెండో మ్యాచ్ లో సీఎస్కే × ముంబయి ఇండియన్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్న
నేడు ఐపీఎల్ సెకండ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ బరిలో దిగాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన సీఎస్కే జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన ముంబయి జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (0) డకౌట్  అయ్యాడు. 4 బంతులు ఆడిన రోహిత్ శర్మ... లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

ఆ తర్వాత ఖలీల్ అహ్మద్ మరోసారి విజృంభించి ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (13)ను కూడా అవుట్ చేయడంతో ముంబయి రెండో వికెట్ చేజార్చుకుంది. వన్ డౌన్ లో వచ్చి విల్ జాక్స్ (11) సైతం క్రీజులో నిలదొక్కుకోకముందే పెవిలియన్ చేరాడు. ఈ వికెట్ రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలో పడింది.

ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ స్కోరు 7 ఓవర్లలో 3 వికెట్లకు 59 పరుగులు. తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 20, తిలక్ వర్మ 14 పరుగులతో ఆడుతున్నారు. 

Rohit Sharma
Chennai Super Kings
Mumbai Indians
IPL 2024
Khalil Ahmed
Cricket Match
MA Chidambaram Stadium
Rohit Sharma Duck Out
Ryan Rickelton
Will Jacks

More Telugu News