Prithviraj Sukumaran: ప్రభాస్ ఇంటి రుచులకు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫిదా

Prithviraj Sukumaran Raves About Prabhas Home Cooked Food
  • పెసరట్టు, చేపల పులుసు చాలా ఇష్టమన్న నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్
  • హైదరాబాద్ లో ఎల్ 2 ఎంపురాన్ చిత్రం ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో ఆసక్తికర విషయాలు పంచుకున్న వైనం
ప్రభాస్ ఇంటి రుచులకు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫిదా అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆ వంటకం పేరు ఏమిటో తెలియదు కానీ, ప్రభాస్ ఇంటి నుంచి పంపిన వంటకాలు బాగా నచ్చాయని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'ఎల్ 2 ఎంపురాన్' ఈ నెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన వంటకాలు చాలా బాగున్నాయని చెప్పిన పృథ్వీరాజ్, తనకు పెసరట్టు, చేపల పులుసు చాలా ఇష్టమని పేర్కొన్నారు. 
Prithviraj Sukumaran
Prabhas
L2 Empuraan
Mohanlal
Telugu Cinema
Indian Cinema
Pan India Movie
Press Meet
Hyderabad
Tollywood

More Telugu News