Nitish Kumar Reddy: ఫీల్డింగ్ చేస్తున్న నితీశ్‌కుమార్ రెడ్డికి పెళ్లెప్పుడంటూ ఫ్యాన్స్‌ ప్ర‌శ్న.. తెలుగు ప్లేయ‌ర్‌ రిప్లై ఏంటో మీరే చూడండి!

Nitish Kumar Reddys Marriage Question by Fans During IPL Match
  • నిన్న ఉప్ప‌ల్ వేదిక‌గా ఎస్ఆర్‌హెచ్‌, ఆర్ఆర్ మ్యాచ్‌
  • బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డ‌ర్‌గా ఉన్న నితీశ్‌కు పెళ్లిపై ప్ర‌శ్న‌
  • ల‌వ్ మ్యారేజ్ చేసుకోన‌న్న తెలుగు ఆట‌గాడు
  • ఈ ఆస‌క్తికర ఘ‌ట‌న తాలూకు వీడియో నెట్టింట వైర‌ల్
నిన్న ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌), రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌) త‌ల‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాడు నితీశ్ కుమార్ రెడ్డి ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డ‌ర్‌గా ఉన్న నితీశ్‌కు డ‌గౌట్ నుంచి కొంత‌మంది అభిమానులు "బ్రో పెళ్లి ఎప్పుడు.. ల‌వ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా?" అని ప్ర‌శ్నించారు. 

దాంతో చేసేదేమీలేక వారికి ఈ తెలుగు ఆట‌గాడు క్లారిటీ ఇచ్చారు. చాలా స్ప‌ష్టంగా తాను ప్రేమ పెళ్లి చేసుకోన‌ని త‌ల‌ను అడ్డంగా ఊపాడు. అది చూసిన అభిమానులు గ‌ట్టిగా కేక‌లు వేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే మొద‌ట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 286 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇది రెండో అత్య‌ధిక స్కోర్‌. అనంత‌రం 287 ప‌రుగుల భారీ లక్ష్య‌ ఛేద‌న‌తో బ్యాటింగ్ ప్రారంభించిన రాజ‌స్థాన్ 242 ప‌రుగులు చేసింది. దీంతో ఎస్ఆర్‌హెచ్ 44 ప‌రుగుల తేడాతో గెలిచింది. ఇషాన్ కిష‌న్ శ‌త‌కం (106) బాద‌గా.. హెడ్ హాఫ్ సెంచ‌రీ (67) న‌మోదు చేశాడు. అటు ఆర్ఆర్ బ్యాట‌ర్ల‌లో ధ్రువ్ జురేల్ (77), సంజూ (66) అర్ధ శ‌త‌కాలు సాధించారు.    
Nitish Kumar Reddy
Sunrisers Hyderabad
Rajasthan Royals
IPL
Cricket
Viral Video
Fan Question
Marriage
Ishan Kishan
Match Highlights

More Telugu News