Trump Supporter: ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీ వల్ల భార్య అరెస్టు.. అయినా చింతించట్లేదంటున్న ట్రంప్ మద్దతుదారుడు

Trump Supporter Defends Trumps Immigration Policy Despite Wifes Arrest
  • ప్రభుత్వ పాలసీలను ట్రంప్ ఇప్పుడు కొత్తగా తయారుచేయలేదని వెల్లడి
  • ఇప్పటికే ఉన్న పాలసీలను మరింత మెరుగ్గా అమలు చేస్తున్నాడని మెచ్చుకోలు
  • ట్రంప్ కు ఓటేసినందుకు తనకిలా జరగాల్సిందేనని మెసేజ్ లు వస్తున్నాయని వివరణ
అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కొరడా ఝళిపిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారిని అడ్డుకోవడంతో పాటు వీసా గడువు తీరిన తర్వాత అమెరికాలోనే ఉంటున్న వారిని జైలుకు పంపడమో, వారి స్వదేశాలకు తిప్పి పంపడమో చేస్తున్నారు. ఈ విషయంలో కఠినంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అక్రమ వలసలపై ట్రంప్ సీరియస్ గా ఉండడంతో అధికారులు కూడా సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీసా గడువు ముగిసిపోయినా దేశంలోనే ఉంటున్న పెరూ మహిళ కామిలా మునోజ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

2019లో స్టడీ, వర్క్ వీసాతో అమెరికాలోకి అడుగుపెట్టిన కామిలా.. బ్రాడ్లే బార్టెల్ అనే అమెరికన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోవిడ్ ఆంక్షల కారణంగా వాయిదా వేసుకున్న హనీమూన్ ను ఇటీవల జరుపుకున్నారు. ఫిబ్రవరిలో ఈ దంపతులు ప్యూర్టోరికోకు హనీమూన్ కు వెళ్లారు. తిరిగి విస్కాన్సిన్ ఎయిర్ పోర్ట్ లో దిగిన తర్వాత కామిలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీసా గడువు ముగిసినప్పటికీ అమెరికాలో అక్రమంగా ఉంటుందనే నేరారోపణతో జైలుకు పంపించారు. ఈ విషయంపై బార్టెల్ న్యాయపోరాటం చేస్తున్నారు.

తాను ట్రంప్ మద్దతుదారునని, మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కే ఓటేశానని బార్టెల్ చెప్పారు. ట్రంప్ అనుసరిస్తున్న వలస విధానం వల్లే తన భార్య అరెస్టు అయిందనే విషయం తెలుసని, అయినప్పటికీ తాను ట్రంప్ కు ఓటేసినందుకు చింతించడంలేదని అన్నారు. అమెరికన్లకు మంచి చేయడం కోసమే ట్రంప్ ప్రయత్నిస్తున్నారని బార్టెల్ అన్నారు. ప్రభుత్వ పాలసీలను ట్రంప్ ఇప్పుడు రూపొందించలేదని, ఉన్న వాటినే మరింత స్ట్రిక్ట్ గా అమలుచేస్తున్నారని వివరించారు. అయితే, ఈ విషయంలో తనకు చాలామంది విద్వేషపూరిత మెసేజ్ లు చేస్తున్నారని బార్టెల్ ఆరోపించారు. ట్రంప్ కు ఓటేసినందుకు మీకిలా జరగాల్సిందేనని, తగిన శాస్తి జరిగిందని విద్వేషం ప్రకటిస్తున్నారని చెప్పారు. రోజువారీ కార్యకలాపాలలో కూడా తాను పలు అవమానాలు ఎదుర్కొంటున్నట్టు బార్టెల్ వివరించారు.
Trump Supporter
Wisconsin
Wife Arrest
Donald Trump
Immigration Policy
Camila Munoz
Bradley Bartell
US Immigration
Visa Overstay
Peruvian Woman

More Telugu News