M.S. Prabhakar: హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుద‌ల

Hyderabad MLC Election Schedule Released
  • మే 1తో ముగియ‌నున్న ఎమ్మెల్సీ ఎంఎస్‌ ప్రభాకర్‌ పదవీ కాలం 
  • ఈ నేపథ్యంలో తాజాగా షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన ఎన్నికల సంఘం 
  • మార్చి 28న ఎన్నిక‌ల‌ నోటిఫికేషన్‌ విడుదల
  • ఏప్రిల్‌ 4 నామినేషన్లు దాఖలుకు ఆఖ‌రి గ‌డువు
  • ఏప్రిల్‌ 23న పోలింగ్.. 25న ఎన్నిక‌ల‌ ఫలితాలు
హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు తాజాగా షెడ్యూల్‌ విడుదలైంది. ఎమ్మెల్సీ ఎంఎస్‌ ప్రభాకర్‌ పదవీ కాలం మే 1వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. ఈ షెడ్యూల్ ప్ర‌కారం మార్చి 28న ఎన్నిక‌ల‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 

ఏప్రిల్‌ 4 నామినేషన్లు దాఖలుకు ఆఖ‌రి గ‌డువు. 7న దాఖ‌లైన‌ నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్‌ 9 వరకు గడువు ఉంటుంది. ఏప్రిల్‌ 23న పోలింగ్,  25న ఎన్నిక‌ల‌ ఫలితాలు వెల్ల‌డ‌వుతాయి.
M.S. Prabhakar
Hyderabad MLC Elections
Election Schedule
Local Body Elections
Hyderabad
MLC Elections 2024
Nomination Dates
Polling Date
Election Results

More Telugu News