Shiva Balaji: ‘కన్నప్ప’ నుంచి కుమారదేవ శాస్త్రిగా శివ బాలాజీ పోస్టర్ విడుదల

Kannappa Movie Update Shiva Balajis Character Revealed
  • మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప
  • ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్
  • ప్రతి సోమవారం ఒక అప్ డేట్
  • ఈ సోమవారం శివబాలాజీ పోస్టర్ రిలీజ్
డైనమిక్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న థియేటర్లోకి రాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించగా... ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కన్నప్ప పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో కన్నప్ప టీం ప్రమోషన్స్‌ను మరింతగా పెంచేసింది.

ప్రతీ సోమవారం నాడు కన్నప్ప సినిమా నుంచి ఓ అప్డేట్ వస్తుండటం ఆనవాయతీగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సోమవారం నాడు శివ బాలాజీ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కన్నప్ప చిత్రంలో శివ బాలాజీ 'కుమారదేవ శాస్త్రి' పాత్రను పోషించారు. ఈ కారెక్టర్‌ను రివీల్ చేస్తూ వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. శివ బాలాజీ ఓ ముని వేషంలో కనిపిస్తున్నారు. ఎంతో నేచురల్‌గా శివ బాలాజీ ఈ లుక్‌లో కనిపిస్తున్నారు. 

ఇప్పటికే శివయ్యగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ అగర్వాల్‌ను, రుద్రుడిగా ప్రభాస్‌ను, మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు పాత్రలకు సంబంధించిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు కన్నప్ప టీం సంసిద్దం అవుతోంది. ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు.
Shiva Balaji
Kannappa
Manchu Vishnu
Kumaradeva Shastri
Movie Poster Release
April 25th Release
Tollywood
Telugu Cinema
Akshay Kumar
Kajal Aggarwal
Prabhas
Mohan Babu

More Telugu News