Shihan Hussaini: సీనియ‌ర్ న‌టుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్ గురువు కన్నుమూత‌!

Veteran Kollywood Actor and Pawan Kalyans Guru Shihan Hussaini Passes Away
  • ప్ర‌ముఖ కోలీవుడ్ న‌టుడు షిహాన్ హుసైని మృతి
  • కొద్దిరోజులుగా బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న న‌టుడు
  • ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉద‌యం క‌న్నుమూత‌
  • ప‌వ‌న్ కు మార్ష‌ల్ ఆర్ట్స్, క‌రాటే, కిక్ బాక్సింగ్ లో శిక్షణ ఇచ్చిన హుసైని
ప్ర‌ముఖ కోలీవుడ్ న‌టుడు షిహాన్ హుసైని (60) అనారోగ్యంతో క‌న్నుమూశారు. కొద్దిరోజులుగా ఆయ‌న బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ చెన్నైలోని ఓ ఆసుప‌త్రిలో చేరారు. అక్క‌డ చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. హుసైని మరణ వార్తపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.

ఆయ‌న 1986లో విడుద‌లైన  'పున్నగై మన్నన్‌' అనే చిత్రం ద్వారా కోలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మయ్యారు. ఆ త‌ర్వాత అనేక చిత్రాల్లో నటించినప్పటికీ, విజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'బద్రి' సినిమా ద్వారా ఆయనకు విశేష గుర్తింపు లభించింది. హుసైని ఆర్చరీ శిక్షకుడిగా కూడా పేరొందారు. ఈ క్రమంలో 400 మందికి పైగా విద్యార్థులకు ప్రొఫెషనల్‌ శిక్షణ అందించారు.

కాగా, హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు హుసైని మార్ష‌ల్ ఆర్ట్స్, క‌రాటే, కిక్ బాక్సింగ్ వంటి యోధ కళల్లో శిక్షణ అందించారు. ఆయ‌న ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకుంటూనే ప‌వ‌న్ బ్లాక్ బెల్ట్ సాధించారు. 
Shihan Hussaini
Pawan Kalyan
Kollywood Actor
Death
Blood Cancer
Martial Arts
Archery Instructor
Badri Movie
Punnagai Mannan
Vijay Actor

More Telugu News