Manchu Vishnu: మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి రఘుబాబు పోస్టర్ విడుదల

Raghubabus Poster from Manchu Vishnus Kannappa Released
  • మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా 'కన్నప్ప'
  • ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఎపిక్ మూవీ
  • 'మల్లు' అనే పాత్రలో రఘుబాబు సీరియస్ లుక్
టాలీవుడ్ కథానాయకుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’పై భారీ హైప్ నెలకొంటోంది. ఈ ఎపిక్ మూవీ ఏప్రిల్ 25న థియేటర్లోకి రాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించగా.. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. 

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కన్నప్ప పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమా మీద అంచనాల్ని పెంచేశాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో కన్నప్ప టీం ప్రమోషన్స్‌ను మరింతగా పెంచేసింది. 

ఈ క్రమంలో నేడు రఘుబాబు పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కన్నప్ప చిత్రంలో రఘుబాబు 'మల్లు' అనే ఓ పాత్రను పోషించారు. ఈ కారెక్టర్‌ను రివీల్ చేస్తూ వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రఘుబాబు ఈ పోస్టర్లో ఆగ్రహంగా కనిపిస్తున్నారు. చూస్తుంటే ఏదో యాక్షన్ సీన్ కి రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. 

ఇప్పటికే శివయ్యగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ అగర్వాల్‌, రుద్రుడిగా ప్రభాస్‌, మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు పాత్రలకు సంబంధించిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు కన్నప్ప టీం సంసిద్దం అవుతోంది. ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు.
Manchu Vishnu
Kannappa
Raghubabu
Telugu Movie
April 25 Release
Movie Poster
Epic Movie
Mohan Babu
Akshay Kumar
Kajal Aggarwal
Prabhas

More Telugu News