Nani: 'ది ప్యారడైజ్' కౌంట్‌డౌన్ పోస్ట‌ర్‌.. అదిరిపోయిన‌ నాని రా అండ్ రస్టిక్‌ లుక్!

Nanis The Paradise Countdown Poster A Rugged and Rustic Look
  • నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో 'ది ప్యారడైజ్' 
  • 2026 మార్చి 26న సినిమా విడుద‌ల 
  • ఇవాళ్టితో మూవీ రిలీజ్‌కు స‌రిగ్గా ఏడాది స‌మ‌యం
  • ఈ నేప‌థ్యంలో కొత్త పోస్ట‌ర్‌ను షేర్ చేసిన‌ హీరో నాని  
'దసరా' తర్వాత హీరో నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'ది ప్యారడైజ్'. వ‌చ్చే ఏడాది మార్చి 26న ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ్టితో మూవీ రిలీజ్‌కు స‌రిగ్గా ఏడాది స‌మ‌యం ఉన్నందున '365 రోజులు' అంటూ ఓ కొత్త పోస్ట‌ర్‌ను హీరో నాని త‌న 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ పోస్ట‌ర్‌లో నాని ఒంటిపై చొక్క‌లేకుండా గ‌న్ ప‌ట్టుకుని ర‌గడ్ లుక్‌లో అదిరిపోయారు. 

ఇక ఇటీవల ఈ చిత్రం నుంచి 'రా స్టేట్‌మెంట్‌' పేరుతో ఓ వీడియోను విడుద‌ల‌ చేసింది చిత్రం యూనిట్‌. ఈ టైటిల్ కు తగ్గట్లుగానే ప్రచార చిత్రంలో వినిపించిన డైలాగ్స్, నాని లుక్, గెటప్ అన్నీ ఊరమాస్ గా ఉన్నాయి. ముఖ్యంగా రెండు జడలతో రా అండ్ రస్టిక్‌ లుక్ లో నాని కనిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. 

కాగా, ఫుల్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారికంగా మూవీ టీమ్ ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్‌ లాంటి విదేశీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ కానుంది. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత‌ సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. త‌మిళ యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ రవిచందర్ బాణీలు అందిస్తున్నారు. 
Nani
The Paradise
Srikanth Odela
Anirudh Ravichander
Telugu Cinema
Pan-India Film
Action Movie
Tollywood
Movie Poster
Release Date

More Telugu News