Palvai Harish Babu: కాళేశ్వరం ప్రాజెక్టు ఎనిమిదో ప్రపంచ వింత అని ప్రచారం చేయించారు: బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్

BJP MLA Accuses KCR of Paid Campaign for Kaleshwaram Project
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆరే ఇంజినీర్ అని విమర్శ
  • మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • లూజ్ సాయిల్, లూజ్ ఫౌండేషన్ మీద కాళేశ్వరాన్ని నిర్మించడం తప్పన్న బీజేపీ ఎమ్మెల్యే
కాళేశ్వరం ప్రాజెక్టును ఎనిమిదో ప్రపంచ వింతగా పెయిడ్ ప్రచారం చేయించారని, ఆ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆరే ఇంజినీర్ అని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు విమర్శించారు. శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

లూజ్ సాయిల్, లూజ్ ఫౌండేషన్ మీద కాళేశ్వరాన్ని నిర్మించడం పెద్ద తప్పని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్, హరీశ్ రావును క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టి శీల పరీక్ష నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Palvai Harish Babu
Kaleshwaram Project
BJP MLA
KCR
Medigadda Barrage
Telangana Politics

More Telugu News