Proddatur Boy: టీచర్లు కొట్టారంటూ కేసు పెట్టిన విద్యార్థి తల్లిదండ్రులు.. అసలు విషయం వెలుగులోకి రావడంతో వారిపైనే తిరిగి పోక్సో కేసు!

Students Parents File Case Against Teachers Face POSCO Charges
  • వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఘటన
  • తోటి విద్యార్థినుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేసిన 9వ తరగతి విద్యార్థి
  • విషయం తెలిసి మందలించిన స్కూల్ టీచర్లు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
  • విద్యార్థి, అతడి తల్లిదండ్రులు, కౌన్సిలర్‌పై పోక్సో కేసు నమోదు
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో 9వ తరగతి చదువుతున్న బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. సహ విద్యార్థినుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేసి వారిని వేధిస్తున్న ఆరోపణలపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఐదుగురు అమ్మాయిల ఖాతాలను హ్యాక్ చేసిన బాలుడు వారి వ్యక్తిగత ఫొటోలు మెసేజ్‌లను ఇతర క్లాసుల అబ్బాయిల మొబైల్స్‌కు పంపి కొన్ని నెలలుగా వేధిస్తున్నాడు. విషయం వెలుగులోకి రావడంతో స్కూల్ టీచర్లు నాలుగు రోజుల క్రితం బాలుడిని మందలించి కొట్టారు. దీంతో బాలుడి తండ్రి అసలు విషయం దాచి టీచర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విషయం తెలిసిన బాధిత బాలికల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు, బాలుడి వేధింపులపై విచారణ చేపట్టిన ప్రొద్దుటూరు ఎంఈవో సావిత్రమ్మ, రూరల్ సీఐ బాలమద్దిలేటి వేధింపులు నిజమేనని తేల్చారు. దీంతో బాలుడితోపాటు అతడికి అండగా ఉన్న తల్లిదండ్రులు మూలే కొండమ్మ, మాధవరెడ్డి, కౌన్సిలర్ మురళీధర్‌రెడ్డిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Proddatur Boy
POSCO Case
Cyber Bullying
Instagram Hacking
School Teachers
Parents
Moole Kondamma
Madhava Reddy
Muralidhar Reddy
YSR District

More Telugu News