Student Arrest Video: అమెరికాలో స్టూడెంట్ కు బేడీలు వేసి తీసుకెళ్లిన పోలీసులు.. వీడియో ఇదిగో!

International Student Arrested in Massachusetts Homeland Security Involved
  • ఆఫ్ క్యాంపస్ లోని అపార్ట్ మెంట్ నుంచి బలవంతంగా తరలింపు
  • వివరాలు తెలియవంటున్న వర్సిటీ అధికారులు
  • వీసాను రద్దు చేసినట్లు ప్రచారం, స్పందించని హోంల్యాండ్ సెక్యూరిటీ ఆఫీసు
అమెరికాలో అక్రమ వలసదారులు, వీసా గడువు ముగిసినా తిరిగి వెళ్లకుండా ఉంటున్న వారిపై ఇమిగ్రేషన్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మసాచుసెట్స్ లో ఓ యూనివర్సిటీ విద్యార్థినిని బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టఫ్ట్స్ యూనివర్సిటీలో చదువుతున్న ఓ విదేశీ విద్యార్థినిని మంగళవారం రాత్రి అధికారులు అరెస్టు చేసినట్లు యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధులు మూడు కార్లలో విద్యార్థిని ఉంటున్న ఆఫ్ క్యాంపస్ లోని అపార్ట్ మెంట్ వద్దకు వచ్చారు.

భుజాన బ్యాగుతో వెళుతున్న విద్యార్థినిని చుట్టుముట్టి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. చేతులు వెనక్కి విరిచి బేడీలు తగిలించారు. ఆపై కారులో అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాలు తెలియరాలేదని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. కాగా, సదరు విద్యార్థిని వీసా రద్దు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై హోంల్యాండ్ సెక్యూరిటీ కానీ, విద్యార్థిని తరపు న్యాయవాది కానీ ఇంకా స్పందించలేదు. స్టూడెంట్ ను అరెస్టు చేసి తీసుకెళుతున్న దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Student Arrest Video
Tufts University Student
US Immigration Arrest
Massachusetts
Viral Video
Visa Expiry
Department of Homeland Security
Illegal Immigration
Deportation

More Telugu News