Jr NTR: 'ఆర్ఆర్ఆర్' చూశాక జ‌పాన్ మహిళ తెలుగు నేర్చుకుంది... తారక్ ఇంట్రెస్టింగ్ ట్వీట్‌!

Jr NTRs Inspiring Tweet Japanese Fan Learns Telugu After Watching RRR
  • ఈ నెల 28న జపాన్‌లో విడుద‌ల‌వుతున్న 'దేవ‌ర'
  • తార‌క్, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ జపాన్ లో ప్రమోష‌న్స్
  • ఈ క్ర‌మంలో జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌పై ఎన్‌టీఆర్ తాజాగా ఆస‌క్తిక‌ర ట్వీట్
ఈ నెల 28న జూనియ‌ర్ ఎన్‌టీఆర్ న‌టించిన 'దేవ‌ర' సినిమాను మేక‌ర్స్‌ జ‌పాన్‌లో విడుద‌ల చేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో తార‌క్, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ జపాన్ లో ప్రమోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌పై ఎన్‌టీఆర్ తాజాగా ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. 

"నేను జపాన్ ను సందర్శించిన ప్ర‌తిసారి నాకు ఎప్పుడూ అందమైన జ్ఞాపకాలు ల‌భిస్తాయి. కానీ, ఈసారి సందర్శన కాస్త భిన్నంగా ఉంది. ఒక జపనీస్ అభిమాని 'ఆర్ఆర్ఆర్' సినిమా చూసిన తర్వాత తాను తెలుగు నేర్చుకున్నానని చెప్పడం నిజంగా నన్ను కదిలించింది. ఒక విధంగా ఎంతో సంతోషాన్నిచ్చింది. సంస్కృతుల మ‌ధ్య వార‌ధిగా ఉన్న సినిమా... భాష‌ను నేర్చుకునేలా చేయ‌డాన్ని సినిమా అండ్ భాషా ప్రేమికుడిగా నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం" అని తార‌క్ త‌న పోస్టులో రాసుకొచ్చారు.
Jr NTR
Tarak
RRR Movie
Japan
Devara Movie
Telugu Language
Japanese Fan
Movie Promotion
Koratala Siva

More Telugu News