Yogaraj Singh: నన్ను టీమిండియా కోచ్ గా చేస్తే... రోహిత్ శర్మను రోజుకు 20 కి.మీ పరిగెత్తిస్తా: యోగరాజ్ సింగ్

Yogaraj Singh If Im Team India Coach Rohit Sharma Will Run 20km Daily
  • ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న యువీ తండ్రి
  • కోహ్లీ, రోహిత్‌లకు అండగా ఉంటానన్న యోగ్‌రాజ్
  • టెస్టుల్లో రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తానని వెల్లడి
ఇటీవల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శరీరాకృతి, ఫిట్ నెస్ పై పలు వ్యాఖ్యలు వెలువడుతుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

యోగరాజ్ సింగ్ తాజాగా 'ఫైండ్ ఏ వే' అనే పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. టీమిండియాకు కోచ్ గా పనిచేసే అవకాశం వస్తే ఏం చేస్తారని ఆయనను హోస్ట్ ప్రశ్నించారు. అందుకాయన బదులిస్తూ... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లను కాపాడుకుంటూ వారికి అండగా ఉంటానని అన్నారు. 

జాతీయ జట్టుకు కోచ్‌గా అవకాశం వస్తే, ఉన్న ఆటగాళ్లతోనే జట్టును తిరుగులేని శక్తిగా మారుస్తానని యోగ్‌రాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. కోహ్లీ, రోహిత్‌ వంటి విలువైన ఆటగాళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. వారిద్దరూ రంజీ ట్రోఫీలో ఆడేలా చూస్తానని, టెస్టుల్లో రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తానని వెల్లడించారు. వారికి పూర్తి మద్దతు ఇస్తానని తెలిపారు. 

ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించడానికి చాలామంది సిద్ధంగా ఉంటారని, కానీ ఆటగాళ్ల కష్టకాలంలో వారికి అండగా ఉండాలని అన్నారు. అవసరమైతే రోహిత్‌ను 20 కిలోమీటర్లు పరిగెత్తిస్తానని, కానీ వారిని వదులుకోనని ఆయన స్పష్టం చేశారు. 
Yogaraj Singh
Team India Coach
Rohit Sharma
Virat Kohli
Cricket Coaching
Indian Cricket Team
Fitness Regime
Ranji Trophy
Test Matches

More Telugu News