Rajat Patidar: ఫిఫ్టీ కొట్టిన కెప్టెన్ పటిదార్... చెన్నైకి భారీ టార్గెట్ సెట్ చేసిన ఆర్సీబీ

Rajat Patidars Fifty Fuels RCBs Massive Target Against CSK
  • ఐపీఎల్ లో నేడు సీఎస్కే × ఆర్సీబీ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేసిన బెంగళూరు 
ఈ సీజన్ తోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్న రజత్ పాటిదార్ ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ పై బాధ్యతతో కూడిన ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో సీఎస్కే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేసింది. 

బెంగళూరు ఇన్నింగ్స్ లో పటిదార్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. పటిదార్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 51 పరుగులు చేశాడు. ఫిల్ సాల్ట్ 32, విరాట్ కోహ్లీ 31, దేవదత్ పడిక్కల్ 27 పరుగులు చేశారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. టిమ్ డేవిడ్ 8 బంతుల్లోనే 22 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడి స్కోరులో 1 ఫోర్, 3 సిక్సులున్నాయి. 

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3, మతీశ పతిరణ 2, ఖలీల్ అహ్మద్ 1, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు.
Rajat Patidar
RCB vs CSK
IPL 2023
Rajat Patidar fifty
Virat Kohli
Chennai Super Kings
Royal Challengers Bangalore
MA Chidambaram Stadium
Cricket

More Telugu News