Abhinaya: పెళ్లి పీట‌లెక్కనున్న ప్ర‌ముఖ న‌టి... కాబోయే భర్తను ప‌రిచ‌యం చేస్తూ పోస్ట్‌!

Popular Telugu Actress Abhinaya Announces Wedding
    
న‌టి అభిన‌య త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్నారు. హైద‌ర‌బాద్‌కు చెందిన స‌న్నీ వ‌ర్మ‌ అనే వ్య‌క్తితో ఈ నెల 9న నిశ్చితార్థం జ‌రిగిన‌ట్టు ఆమె సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. కాబోయే భ‌ర్త‌ను ప‌రిచ‌యం చేస్తూ, అత‌నితో క‌లిసి దిగిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేశారు. త్వ‌ర‌లోనే తాను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. సినీ అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

కాగా, పుట్టుక‌తో చెవిటి, మూగ అయిన‌ప్ప‌టికీ అభిన‌య సినిమాల్లో అద్భుతంగా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. ‘ధ్రువ’, ‘శంభో శివ శంభో’,‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘రాజుగారి గ‌ది2’ వంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు.
Abhinaya
Abhinaya wedding
Tollywood actress wedding
Abhinaya marriage
Sunny Varma
Telugu actress marriage
South Indian actress wedding
Celebrity wedding
Deaf actress

More Telugu News