Kannappa: 'క‌న్న‌ప్ప' విడుద‌ల వాయిదా... క్షమాపణ కోరుతూ మంచు విష్ణు కీల‌క‌ ప్ర‌క‌ట‌న‌

Kannappa Movie Release Postponed Manchu Vishnu Apologizes
  • ఏప్రిల్ 25న విడుద‌ల కావాల్సిన క‌న్న‌ప్ప‌
  • వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ కోసం మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం 
  • దీంతో ముందు చెప్పిన తేదీకి రావ‌డం లేద‌ని మంచు విష్ణు ప్ర‌క‌ట‌న‌
  • త్వ‌ర‌లోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టిస్తామ‌న్న మంచువారబ్బాయి
మంచు ఫ్యామిలీ ప్రతిష్ఠాత్మకంగా తెర‌కెక్కిస్తున్న‌ 'క‌న్న‌ప్ప' చిత్రం విడుద‌ల వాయిదా ప‌డింది. ఏప్రిల్ 25న ఈ చిత్రం విడుద‌ల కావాల్సి ఉండ‌గా... ఈరోజు న‌టుడు, నిర్మాత‌ మంచు విష్ణు సోష‌ల్ మీడియా వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సినిమా విడుద‌ల ఆల‌స్యం అవుతుంద‌ని ప్ర‌క‌టించారు. వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ కోసం మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉండడంతో రిలీజ్ వాయిదా వేస్తున్న‌ట్లు ట్వీట్ చేశారు.

"క‌న్న‌ప్ప సినిమాను అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో తీర్చిదిద్దుతున్నాం. మూవీ యూనిట్ మంచి ఔట్‌పుట్ కోసం రేయింబ‌వ‌ళ్లు కష్ట‌ప‌డుతోంది. వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ కోసం మ‌రిన్ని వారాలు ప‌ట్టే అవ‌కాశం ఉంది. అందుకే విడుద‌ల తేదీ ఆల‌స్యం కానుంది. దీనికి మేం చింతిస్తున్నాం. మీ ఓపిక‌కు, మ‌ద్ద‌తుకు ధ‌న్య‌వాదాలు. త్వ‌ర‌లో కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం" అని మంచు విష్ణు ఒక నోట్ విడుద‌ల చేశారు.  

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన 'కన్నప్ప'కు ముఖేశ్‌ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ ఎపిక్ మూవీని మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ రుద్రుడి పాత్ర‌ చేస్తుండగా... మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ఇతర పాత్రలు పోషించారు.
Kannappa
Manchu Vishnu
Kannappa Movie
Kannappa Release Date
Manchu Mohan Babu
Prabhas
Mohanlal
Akshay Kumar
Kajal Aggarwal
Preity Zinta
Telugu Cinema
Tollywood

More Telugu News