Telangana Government: తెలంగాణలో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూళ్లు

Record Property Tax Collection in Telangana Crosses 1000 Crores
  • కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వన్ టైమ్ సెటిల్మెంట్‌కు అవకాశం
  • జీహెచ్ఎంసీ తరహాలో 90 శాతం రాయితీ ఇచ్చిన పురపాలక శాఖ
  • వెయ్యి కోట్లు దాటిన ఆస్తి పన్ను
తెలంగాణ రాష్ట్రంలో ఆస్తి పన్ను వసూళ్లు రూ. 1,000 కోట్ల మైలురాయిని దాటాయి. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై ఒకేసారి చెల్లింపునకు (వన్ టైమ్ సెటిల్మెంట్ - ఓటీఎస్) తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. పురపాలక శాఖ జీహెచ్ఎంసీ తరహాలో ఆస్తి పన్నుపై వడ్డీలో 90 శాతం రాయితీ ఇవ్వడంతో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కలిపి ఇప్పటి వరకు రూ. 1,010 కోట్ల మేర ఆస్తి పన్ను వసూలైనట్లు పురపాలక శాఖ వెల్లడించింది. మార్చి 31 నాటికి ఆస్తి పన్ను బకాయిలపై 10 శాతం వడ్డీ చెల్లించిన వారికి ఓటీఎస్ వర్తిస్తుందని పురపాలక శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మార్చి 30, 31 తేదీల్లో సెలవు దినాలు అయినప్పటికీ ప్రజలు ఆస్తి పన్ను చెల్లించవచ్చని తెలిపింది.
Telangana Government
Property Tax
Telangana Property Tax Collection
Telangana
GHMC

More Telugu News