Allam Srinivasa Rao: ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావుకు శుభాభినందనలు: మంత్రి నారా లోకేశ్

AP Minister Nara Lokesh Congratulates Professor Allam Srinivasa Rao
  • ప్రపంచంలోని అగ్రశ్రేణి శాస్త్రవేత్తల జాబితా విడుదల చేసిన స్టాన్ ఫోర్డ్ వర్సిటీ
  • ఏపీ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావుకు ఆ జాబితాలో స్థానం
  • స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్
ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోని అగ్రశ్రేణి శాస్త్రవేత్తల జాబితాను విడుదల చేసింది. అందులో ఏపీకి చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావుకు స్థానం లభించింది. దీనిపై ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ వర్సిటీ అగ్రశ్రేణి శాస్త్రవేత్తల జాబితాలో స్థానం సంపాదించిన ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావును అభినందిస్తున్నట్టు తెలిపారు. 

ప్రకాశం జిల్లాకు చెందిన అల్లం శ్రీనివాసరావు భౌతికశాస్త్రంలో అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని లోకేశ్ కొనియాడారు. పేద కుటుంబంలో జన్మించినప్పటికీ, పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి, ప్రపంచస్థాయి శాస్త్రవేత్తగా ఎదగడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. 250కి పైగా పరిశోధనా పత్రాలను సమర్పించడంతో పాటు అనేక ఆవిష్కరణలు చేసిన శ్రీనివాసరావు కృషిని ప్రశంసించారు.

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శ్రీనివాసరావు తన విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఉపయోగించాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Allam Srinivasa Rao
Stanford University
Professor
Physics
Andhra Pradesh
Nara Lokesh
Top Scientists
Vikram Simhapuri University
AP Minister
Research Papers

More Telugu News