HCU: విద్యార్థుల నిరసన... హెచ్‌సీయూలో ఉద్రిక్తత

- భూముల వేలంపాటను నిలిపివేయాలని విద్యార్థి సంఘాల ఆందోళన
- అక్రమ వేలాన్ని ఆపేయాలి అంటూ నినాదాలు
- పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశ్వవిద్యాలయం భూములను అక్రమంగా వేలం వేస్తున్నారని , దీన్ని నిలిపివేయాలని పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అక్రమ వేలం పాటను వెంటనే ఆపేయాలని నినాదాలు చేశారు.
నిరసన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. పోలీసుల వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు 'పోలీసులు గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. ఈ తోపులాటలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.