Pawan Kalyan: సుఖాలను అందించే మంచి పాలన ప్రజల ముంగిటకు వచ్చింది: పవన్ కల్యాణ్

Pawan Kalyans Ugadi Wishes Good Governance Reaching People
  • ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
  • విశ్వావసు అనే గంధర్వుడి పేరుతో ఈ ఉగాది 
  • జీవితం కష్టసుఖాల సమ్మేళనం
  • గత ప్రభుత్వ పాలన కష్టాలమయమని విమర్శ
ఉగాది పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 'ఎక్స్' వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. పండుగలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, కళలు జాతిని సజీవంగా నిలుపుతాయని ఆయన అన్నారు. మన ముంగిటకు వచ్చిన ఉగాది తెలుగువారి వారసత్వపు పండుగ అని కొనియాడారు.

విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. జీవితం కష్టసుఖాల సమ్మేళనమని, మన ఉగాది పచ్చడిని అందుకు సంకేతంగా భావిస్తామని అన్నారు.

గత ప్రభుత్వ పాలన కష్టాలమయంగా ఉండగా, ఇప్పుడు ప్రజలకు సుఖాలను అందించే మంచి పాలన ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రజల ముంగిటకు వచ్చిందని ఆయన అన్నారు. చైత్ర మాసపు శోభతో వసంతాన్ని మోసుకొచ్చిన శ్రీ విశ్వావసు నామ ఉగాది తెలుగు లోగిళ్లను సిరిసంపదలతో పచ్చగా ఉంచాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. 
Pawan Kalyan
Ugadi
Andhra Pradesh
Deputy CM
Telugu Culture
Festival
Good Governance
Welfare Schemes
Political News
Indian Politics

More Telugu News