Chinese Nurses: ప్రాణాలకు తెగించి పసికందులను కాపాడిన నర్సులు.. వీడియో ఇదిగో!

Chinese Nurses Risk Lives Saving Babies During Earthquake
  • మయన్మార్ పెను భూకంపానికి పక్కనే ఉన్న చైనాలోనూ ప్రకంపనలు
  • భూకంపం ధాటికి అల్లల్లాడిన చైనా ఆసుపత్రి
  • అప్పుడే పుట్టిన పసికందులను ఉంచిన వార్డులో భయానక పరిస్థితి
మయన్మార్ ను అతలాకుతలం చేసిన పెను భూకంపం ప్రభావం చుట్టుపక్కల దేశాలపైనా పడింది. థాయ్ లాండ్ లోనూ భారీ నష్టం వాటిల్లగా.. పొరుగునే ఉన్న చైనాలోనూ భూమి కంపించింది. భూకంపం ధాటికి చైనాలోని ఓ ఆసుపత్రి తీవ్రంగా కంపించింది. ఆసుపత్రి భవనం ఊయల మాదిరిగా ఊగిపోయింది. దీంతో అప్పుడే జన్మించిన పసికందులను ఉంచిన వార్డులో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పసికందులను ఉంచిన స్ట్రోలర్లు గదిలో చెల్లాచెదురయ్యాయి. దీంతో అక్కడే ఉన్న నర్సులు వెంటనే అప్రమత్తమయ్యారు. భవనం కూలిపోయే ప్రమాదం ఉన్నా వెరవకుండా పిల్లలను కాపాడటానికి ప్రయత్నించారు.

సరిగ్గా నిలబడలేని పరిస్థితిలో కూడా నర్సులు పిల్లల స్ట్రోలర్లు కదలకుండా పట్టుకున్నారు. ఓ నర్సు శిశువును ఎత్తుకుని, స్ట్రోలర్ లో ఉన్న మరో శిశువును కాపాడటానికి ప్రయత్నించడం, మరొక నర్సు నాలుగు స్ట్రోలర్లను పట్టుకుని నిలబడడం ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ నర్సుల అంకిత భావానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో తమను కదిలించిందని, మనుషుల్లో రాక్షసత్వం పెరిగిపోతున్న ఈ రోజుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉందని ఈ వీడియో చూస్తే తెలుస్తోందని కామెంట్లు పెడుతున్నారు.
Chinese Nurses
Earthquake in China
Hospital
Brave Nurses
Viral Video
Childcare
Newborn Babies
Myanmar Earthquake
Thailand Earthquake
CCTV Footage

More Telugu News