Adinarayana Reddy: వైసీపీకి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు కూడా రాకుండా చేస్తాం: బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

BJP MLA Adinarayana Reddy vows to wipe out YSRCP in next elections
  • వివేకా హత్య గురించి అవినాశ్ రెడ్డికి అంతా తెలుసన్న ఆదినారాయణరెడ్డి
  • జగన్ కుటుంబమంతా కేసుల్లో ఇరుక్కుపోయిందని విమర్శ
  • వారు చేసిన పాపాలను తమపై నెట్టే ప్రయత్నం చేశారని మండిపాటు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి అంతా తెలుసని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ కుటుంబమంతా ఈడీ, సీబీఐ కేసుల్లో ఇరుక్కుపోయిందని అన్నారు. కడప జిల్లా పరువు తీసేశారని విమర్శించారు. వారు చేసిన పాపాలన్నింటినీ తమపై నెట్టే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. వివేకా హత్య కేసులో తమకి సంబంధం లేదని వారు నిరూపించుకోవాలని చెప్పారు.

ఎవరు చనిపోయినా జిల్లాకు రావడం, పరామర్శల పేరుతో రాజకీయాలు చేయడం జగన్ కు అలవాటయిందని ఆదినారాయణరెడ్డి విమర్శించారు. రెండు, మూడేళ్లలో ఎన్నికలు వస్తాయని, తాను మళ్లీ సీఎం అవుతానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. జమిలి ఎన్నికలు వస్తే వైసీపీకి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు కూడా రాకుండా చేస్తామని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పెద్దదని అన్నారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి కూడా రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని దుయ్యబట్టారు.
Adinarayana Reddy
BJP MLA
YS Jagan Mohan Reddy
YCP
YS Vivekananda Reddy murder
AP Politics
Andhra Pradesh Elections
Liquor Scam
ED CBI Cases
Kadapa

More Telugu News