Mitchell Starc: స్టార్క్ దెబ్బకు చిగురుటాకులా వణికిన హైదరాబాద్

Sunrisers Hyderabad Stumbles Against Mitchell Starcs Fiery Spell
      
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా విశాఖపట్టంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చిగురుటాకులా వణికింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి పరుగు తీసే క్రమంలో ఓపెనర్ అభిషేక్ శర్మ(1) రనౌట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 11 పరుగులు. అది మొదలు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.

మిచెల్ స్టార్క్ పదునైన బంతులకు వికెట్లు టపటపా రాల్చుకున్న హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 20 పరుగుల వద్ద ఇషాన్ కిషన్(2), 25 పరుగులు వద్ద నితీశ్ కుమార్ రెడ్డి(0), 37 పరుగుల వద్ద ట్రావిస్ హెడ్ (22) పెవిలియన్ చేరారు. హైదరాబాద్ కోల్పోయిన నాలుగు వికెట్లు స్కార్క్ బౌలింగ్‌లోనే కావడం గమనార్హం. ఒకటి రనౌట్ కాగా, మిగతా మూడు స్టార్క్ ఖాతాలో చేరాయి. 

కష్టాల్లో పడిన జట్టును అనికేత్ వర్మ, క్లాసెన్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. దూకుడుగా ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిశాయి. హైదరాబాద్ నాలుగు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. అనికేత్ 40, క్లాసెన్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Mitchell Starc
Sunrisers Hyderabad
Delhi Capitals
IPL 2023
Visakhapatnam
Abhishek Sharma
Ishan Kishan
Nitish Kumar Reddy
Travis Head
Ankit Rajpoot

More Telugu News