Chandrababu Naidu: అమరావతిలో పీ-4 లోగో ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Chandrababu Naidu and Pawan Kalyan Launch Zero Poverty P4 Program
  • నేడు ఉగాది
  • అమరావతిలో పీ-4 ఆవిష్కరణ కార్యక్రమం
  • హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
విజయవాడ: పేదరికం లేని సమాజం తన జీవిత లక్ష్యమని, సున్నా పేదరికం సాధించడమే లక్ష్యంగా 'జీరో పావర్టీ పీ-4... మార్గదర్శి-బంగారు కుటుంబం' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని అన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు అందుబాటులో ఉంటేనే న్యాయమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.  పీ-4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్ షిప్ అని వివరించారు. 

ఇవాళ అమరావతిలో పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పీ-4 లోగోను ఆవిష్కరించారు. పీ-4 కోసం ప్రత్యేక పోర్టల్ ([email protected])ను చంద్రబాబు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు. భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మానుయేల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు.
Chandrababu Naidu
Pawan Kalyan
Zero Poverty P-4
Andhra Pradesh
Mangalagiri
Public Private People Partnership
Poverty Alleviation
Amravati
Swarna Andhra P4
Golden Family

More Telugu News