Tonga Earthquake: పసిఫిక్ టోంగా దీవుల్లో భారీ భూకంపం... సునామీ అలర్ట్ జారీ

Major Earthquake Strikes Tonga Tsunami Warning Issued
  • టొంగాలో 7.1 తీవ్రతతో భూకంపం
  • యూఎస్ జీఎస్ ప్రకటన
  • తీర ప్రాంత ప్రజలకు సునామీ హెచ్చరికలు
పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న టోంగా దీవుల్లో ఆదివారం నాడు 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ఈ భూకంపం పంగై గ్రామానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల (56 మైళ్లు) దూరంలో సంభవించింది. దీని ప్రభావం నియు ద్వీప దేశం వరకు విస్తరించిందని హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. నియు, టోంగా తీరాల్లో అలల స్థాయి 0.3 మీటర్ల నుంచి 1 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. తొలుత, భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.

తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని టొంగా అధికారులు ప్రజలకు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు లేదా తీర ప్రాంతానికి దూరంగా వెళ్లాలని టోంగా నేషనల్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్ కార్యాలయం ఫేస్‌బుక్ ద్వారా తెలిపింది.

టోంగాలో భూకంపాలు సాధారణం. ఇది తక్కువ ఎత్తులో ఉన్న ద్వీపసమూహం. ఇక్కడ దాదాపు 1,00,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇది ఆగ్నేయాసియా గుండా పసిఫిక్ బేసిన్ వరకు విస్తరించి ఉన్న తీవ్రమైన టెక్టోనిక్ కార్యకలాపాల ప్రాంతమైన 'రింగ్ ఆఫ్ ఫైర్' పై ఉంది.

శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడం తెలిసిందే. దీని ప్రభావంతో అనేక భవనాలు కూలిపోయాయి. విమానాశ్రయంతో సహా ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. 1,600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లోనూ భూకంప ప్రభావంతో 10 మంది మరణించారు.

Tonga Earthquake
Pacific Ocean Earthquake
7.1 Magnitude Earthquake
Tsunami Warning
Tonga Tsunami
Niue
USGS
Ring of Fire
Natural Disaster
Earthquake in Tonga

More Telugu News