Sunrisers Hyderabad: హెచ్సీఏతో వివాదం... సన్ రైజర్స్ హైదరాబాద్ కు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ

Sunrisers Hyderabad Faces HCA Dispute AP Offers Bumper Deal
  • హెచ్సీఏతో సన్ రైజర్స్ జట్టుకు విభేదాలు
  • ఏపీకి రావాలంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానం
  • తక్కువ అద్దెకు విశాఖ స్టేడియం ఇస్తామని హామీ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ), ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ కు మధ్య వివాదం నెలకొన్ని సంగతి తెలిసిందే. హెచ్సీఏ ఒత్తిడి, వేధింపులను తట్టుకోలేకపోతున్నామంటూ సన్ రైజర్స్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఉచిత టికెట్ ల కోసం హెచ్సీఏ ఉన్నతాధికారులు ముఖ్యంగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు బెదిరిస్తున్నారని తెలిపింది. ఇలాగైతే తాము హైదరాబాద్ ను వదిలి వెళ్లిపోతామని హెచ్చరించింది. 

కోరినన్ని ఫ్రీ పాసులు ఇవ్వనందున ఓ మ్యాచ్ లో తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్స్ కి తాళాలు వేశారని హెచ్సీఏ కోశాధికారికి సన్ రైజర్స్ లేఖ రాశారు. ఆ లేఖ ప్రతి తమ వద్ద ఉందంటూ ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. 

ఈ పరిణామాల నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఏపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏపీకి రావాలని ఆంధ్ర క్రికెట్ సంఘం ఆహ్వానించింది. తక్కువ అద్దెకు విశాఖ స్టేడియంను ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో సన్ రైజర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. ఏపీ ప్రజలు కూడా తమ రాష్ట్రానికి ఐపీఎల్ ఫ్రాంఛైజీ లేకపోవడాన్ని వెలితిగా ఫీల్ అవుతున్నారు.
Sunrisers Hyderabad
HCA
Andhra Cricket Association
IPL Franchise
Visakhapatnam Stadium
Jagan Mohan Rao
Hyderabad Cricket Association Dispute
Free Tickets Controversy
AP Cricket Offer
IPL

More Telugu News